ప్రభుత్వాల తీరును ఎండగట్టిన కళాకారులు

ABN , First Publish Date - 2022-03-06T05:13:51+05:30 IST

కార్మికులు, ఉద్యోగులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను కళాకారులు ఎండగట్టారు.

ప్రభుత్వాల తీరును ఎండగట్టిన కళాకారులు
ప్రదర్శన ఇస్తున్న కళాకారులు

పెద్ద దోర్నాల, మార్చి 5 : కార్మికులు, ఉద్యోగులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను కళాకారులు ఎండగట్టారు. ఈ నెల 6,7వ తేదీలలో గుంటూరులో నిర్వహించే రాష్ట్ర ఏఐటీయూసీ మహాసభలను జయప్రదం చేయాలని శనివారం కళాజాతా బృందం సభ్యులు దోర్నాలలో ప్రదర్శన నిర్వహించారు.  ప్రభుత్వాల తీరును నిరసిస్తూ పాటలను పాడుతూ నృత్యం చేశారు.  మహాసభలను జయప్రదం చేయాలని  సంఘ రాష్ట్ర నాయకుడు మునెప్ప కోరారు.  కార్యక్రమంలో నాయకులు సుంకయ్య, రమేష్‌బాబు, శ్రీనివాసరావు, మండల నాయకుడు తిరుమలయ్య, కళాకారులు పాల్గొన్నారు.

మహాసభలను జయప్రదం చేయాలి

కంభం : మార్చి 6, 7, 8 తేదీలలో గుంటూరులో జరిగే  ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని  ఆ సంఘ జిల్లా కార్యదర్శి షేక్‌ మహమ్మద్‌ ఇబ్రహీం కార్మికులకు విజ్ఞప్తి చేశారు. మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు లాడ్జి సెంటర్‌ నుంచి కార్మికుల మహాప్రదర్శన, సాయంత్రం 4గంటలకు శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిర్‌ ఓపెన్‌ ఆడిటోరియంలో గురుదాస్‌దాస్‌ గుప్తా మైదానంలో  బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. 7, 8 తేదీలలో ప్రతినిధుల సమావేశాలు ఉంటాయన్నారు.  ఈ మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్‌, రాష్ట్ర నాయకులు రావులపల్లి రవీంద్రనాథ్‌, జి.ఓబులేసు, ఎం.నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 


Updated Date - 2022-03-06T05:13:51+05:30 IST