అపూర్వ సమ్మేళనం
ABN , First Publish Date - 2022-06-27T05:10:00+05:30 IST
పామూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా జరిగింది.
గురువులకు ఘన సన్మానం
పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న స్నేహితులు
పామూరు, జూన్ 26 : పామూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. 1976 - 77 సంవత్సర పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం స్థానిక అనిల్ గార్డెన్ ఫంక్షన్ హల్‌లో ఘనంగా నిర్వహించారు. ముందుగా అప్పటి ప్రధానో పాధ్యాయులు ఒ.సింగయ్య, గణిత ఉపాఢ్యాయుడు శివరామయ్యకు పాదాభి వందనం చేసి, ఘనంగా సన్మానించారు. ఉప సర్పంచి వైవీ సాయికిరణ్ మాట్లాడుతూ క్రమ శిక్షణతోనే ఉన్నత శిఖరాలు అధిరో హి స్తారన్నారు. జీవితంలో ఆర్థిక స్థోమత ఉన్నవారు చ దువు కున్న పాఠశాల అభివృద్ధికి సా యం అందించాలని కోరారు. ప్రస్తుత హెచ్ ఎం రవీంద్ర నాథ్, ప్రిన్సిపాల్ గుత్తి రమణ య్య మాట్లాడుతూ పూర్వ పా ఠశాల, ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకోవడం హర్షనీయమన్నారు. అనంతరం పూర్వ విద్యా ర్థులు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు, ప్ర స్తుత స్థితిగతులను ఒకరికొకరు చెప్పు కున్నారు. షేక్ సత్తార్ మాతృ మూర్తి షేక్ ఖాదర్‌బీని ఘనంగా సన్మా నించారు. కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ చంద్రావతి, రిటైర్డ్ డీఈ వో కార్యాలయ అధికారి నీరుకట్టు రోశయ్య, మాజీ ఆర్మీ ఉద్యోగి గరికి పాటి వె ంకటస్వామి, రిటైర్డ్ ఆర్టీసీ జేడీసీ గద్దె శీనయ్య, మంచికంటి సుబ్బారావు, షేక్ అ బ్దుల్ సత్తార్, సరభిపద్మనాభయ్య, మాల్యాద్రి, మస్తాన్ బాషా, వెంక టే శ్వర్లు, వీరయ్య, లక్ష్మణ, ముప్పసాని శ్రీధర్, వెంకట స్వామి, ఉప్పలపాటి కనకయ్య,తబశీలు అంబయ్య, బాల గుర్నా థం, కొత్త పల్లి అ నంతమ్మ, రాచూరి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.