గుర్తు తెలియని వాహనం ఢీ కొని జింక మృతి

ABN , First Publish Date - 2022-10-03T06:10:04+05:30 IST

గుర్తు తెలియని వాహనం ఢీ కొని జింక మృతిచెందిన ఘట న మండల పరిధిలోని గణపతి చెక్‌పోస్టు సమీపంలోని శ్రీశైలం-దోర్నాల ఘాట్‌రోడ్డులో మూలమలుపు వద్ద ఆదివారం జరిగింది.

గుర్తు తెలియని వాహనం ఢీ కొని జింక మృతి
రోడ్డుపక్కన పడి ఉన్న జింక

పెద్దదోర్నాల, అక్టోబరు 2: గుర్తు తెలియని వాహనం ఢీ కొని జింక మృతిచెందిన ఘట న  మండల పరిధిలోని గణపతి చెక్‌పోస్టు సమీపంలోని శ్రీశైలం-దోర్నాల ఘాట్‌రోడ్డులో మూలమలుపు వద్ద ఆదివారం జరిగింది. గుర్తించిన అటవీ శాఖాధికారులు రేంజి అధికారి విశ్వేశ్వరరావుకు సమాచారం అందజేశారు. ఆయన పశువెద్యులతో జింకకు చికిత్స అందించినప్పటికీ మృతిచెందింది. 

మరో ఘటనలో జింకకు గాయాలు

సంతనూతలపాడు : సంతనూతలపాడు మండలం ఎనికపాడు పొలాల్లో కుక్కల దాడిలో గాయపడ్డ జింకను ఆదివారం స్థానికులు గమనించి ఎస్సై బి.శ్రీకాంత్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన దానిని పశువైద్యశాలకు తరలించి చికిత్స అందించిన అనంతరం అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  ఒంగోలు అటవీశాఖ విభాగానికి తరలించి ఆరోగ్యం కుదుటపడిన వెంటనే అటవీప్రాంతంలో వదిలి పెడతామని సిబ్బంది తెలిపారు.

Read more