ఆసక్తి రేకిత్తించేలా వైజ్ఞానిక ప్రదర్శన
ABN , First Publish Date - 2022-12-16T00:03:13+05:30 IST
విద్యార్థిలో విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి, వైజ్ఞానిక ఆలోచనలు పెంచేందుకు సైన్స్‌ఫెయిర్ దోహదం చేస్తుందని ఎంపీపీ అరుణ అన్నారు.
మార్కాపురం(వన్‌టౌన్), డిసెంబరు 15: విద్యార్థిలో విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి, వైజ్ఞానిక ఆలోచనలు పెంచేందుకు సైన్స్‌ఫెయిర్ దోహదం చేస్తుందని ఎంపీపీ అరుణ అన్నారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఫైర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. వివిధ విభాగాలలో 70కి పైగా ప్రదర్శనలు ప్రదర్శించారని ప్రథమ శ్రేణిలో ఎంపికైన ప్రాజెక్టులను జిల్లా స్థాయిలో పాల్గొంటా యని ఎంఈఓ రాందాస్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
కంభం : విద్యార్థులు రూపొందించిన పలు వైజ్ఞానిక పరికరాలు ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయని జడ్పీటీసీ సభ్యురాలు కొత్తపల్లి జ్యోతి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పా టు చేసిన మండలస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయన్నారు. విద్యార్థులు రూపొందించిన సుమారు 100 ప్రదర్శనలను మండలంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా తిలకించారు. గురుకుల పాఠశాల విద్యార్థులు రూపొందించిన ఆయిల్ స్కిమ్మర్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్లు, తురిమెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన మిని రాకెట్, పెద్దనల్లకాల్వ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన మల్టీపర్పస్ ఓవెన్, కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన విటమిన్స్, ఫంక్షన్స్, కొండ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణ, వాటర్‌ఫాల్, మెడిసిన్ ప్లాంట్స్, గ్యాస్‌కట్టర్, తదితర ప్రాజెక్టులు అలరించాయి. ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, సర్పంచ్ బి.తిరుపాలమ్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో మాల్యాద్రి, హెచ్‌ఎంలు రామకృష్ణ అమూల్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పెద్ద దోర్నాల : విద్యార్ధులు నూతనంగా ఆలోచించాలని, మానవ మనుగడకు ఉపకరించే ఆవిష్కరించాలని ఎంఈవో మస్తాన్ నాయక్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఆడిటోరియంలో విద్యార్థులు గురువారం విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధి దశలోనే పలు ఆసక్తికర నూతన అంశాలను పరిశోధించవచ్చన్నారు. ఈ క్రమంలో ఎన్నో ప్రయోగాల ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెద్ద బొమ్మలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ సలాం, ఎస్.కిరణ్ , కిశోర్ కుమార్, ఉపాధ్యాయురాలు సుధారాణి, ఎం.వర్ధన్, ఎస్‌పీంసీ చైర్మన్ షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
రాచర్ల : సైన్సు ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులు అంది పుచ్చుకోవాలని ఎంపీపీ షేక్ ఖాశీంభీ అన్నారు. మండలంలోని రాచర్లలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, కస్తూరిభా బాలికల విద్యాలయం, ఏపీ మోడల్ స్కూల్, బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు వారి ప్రదర్శన నమూనాలను పదర్శించి వివరించారు. కార్యక్రమంలో ఎంఈవో కోటేశ్వరరావు, ఎంపీడీవో కవితాచౌదరి, ప్రిన్సిపాల్స్ హనుమాదేవి, సుధాకర్, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.