దుష్టపాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2022-03-06T05:15:46+05:30 IST

వైసీపీ దుష్టపాలనకు చరమగీతం పాడాలని టీడీ పీ కొండపి నియోజకవర్గ పరిశీలకుడు మన్నెం మోహనకృష్ణ పిలుపుని చ్చారు.

దుష్టపాలనకు చరమగీతం పాడాలి
మాట్లాడుతున్న పరిశీలకుడు మన్నెం మోహనకృష్ణ

 టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు మోహనకృష్ణ పిలుపు

కొండపి, మార్చి 5: వైసీపీ దుష్టపాలనకు చరమగీతం పాడాలని టీడీ పీ కొండపి నియోజకవర్గ పరిశీలకుడు మన్నెం మోహనకృష్ణ పిలుపుని చ్చారు. శనివారం మధ్యాహ్నం కొండపిలోని శ్రీసాయి సీతారామ కల్యాణ మండపంలో ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అధ్యక్షతన జరి గిన పార్టీ నియోజకవర్గ స్థాయి విస్త్రత నాయకులు, కార్యకర్తల సమావే శంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని అన్నారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్‌ మా ట్లాడుతూ సీఎం జగన్‌, నాయకుల దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 2024కు కష్టాలు తొలగిపోయి చంద్రబాబు సార థ్యంలో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలకు మంచి రోజులు త్వరలో రానున్నాయన్నారు. మనపార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకు చూసుకుంటుందని, కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని పిలుపుని చ్చారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ బీసీ, ఎస్సీలకు అభివృద్ధికి పాటుపడిందని టీడీపీయేన న్నారు. కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ  సంవత్సర కాలంపాటు ప్రజలు ఓర్చుకుంటే రాష్ట్రానికి పట్టిన పీడ వదులుతుందన్నారు. 2024లో రాష్ట్రంలో టీడీపీ అధికా రంలోకి వస్తుందన్నారు. కొండపిలో హ్యాట్రిక్‌ కొట్టాలన్నారు. ఎర్రగొండపా లెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో బడుగుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలయ్యాయన్నారు.

మాజీ ఎమ్మెల్యే గుండపనేని అచ్యుత్‌కుమార్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొర్రెపాటి రామయ్య చౌదరి తదితరులు మాట్లాడారు. సమావేశంలో టీడీపీ ఆరు మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభకు ముందుగా పార్టీ జెండాను అవిష్కరించారు. ముందుగా దివంగత ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

Read more