అమరలింగేశ్వరస్వామి ఆలయం జీర్ణోద్ధరణ

ABN , First Publish Date - 2022-12-12T00:35:07+05:30 IST

మండలంలోని అయ్యం బొట్లపల్లి గ్రామ సమీపంలో గుడిబోడు కొండపై ఉన్న అమరలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించారు.

అమరలింగేశ్వరస్వామి ఆలయం జీర్ణోద్ధరణ

ఎర్రగొండపాలెం, డిసెంబరు 11 : మండలంలోని అయ్యం బొట్లపల్లి గ్రామ సమీపంలో గుడిబోడు కొండపై ఉన్న అమరలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. అమరలింగేశ్వర స్వామి మూలవిరాట్‌ను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ప్రతిష్ఠించారు. గ్రామస్థులు శాంతిపూజలు నిర్వహించారు. రెండు సంవత్సరాలక్రితం గుడిబోడు కొండపై అమరలింగేశ్వరస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం దొంగలు స్వామివారి విగ్రహాన్ని పెకలించారు. అప్పటి నుంచి ఆలయంలో నిత్య దూపదీప నైవేథ్యం లేకుండా పోయింది. దీంతో గ్రామస్థులు కొందరు అమరలింగేశ్వరస్వామి ఆలయం పునఃనిర్మాణం కోసం మంగళగిరి వద్ద తాళ్లాయిపాలెం శైవక్షేత్ర ఫీఠాదిపతి శివస్వామిని సంప్రదించారు. శివస్వామి ఆలోచన మేరకు నూతన ఆలయం నిర్మించారు. అప్పటి వరకు మూలవిరాట్‌కు బాలాలయంలో పూజ లు చేశారు. ప్రస్తుతం శివస్వామి ఆధ్వర్యంలో ఆలయ జీర్ణోద్ధరణ జరిగింది. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:35:07+05:30 IST

Read more