అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి
ABN , First Publish Date - 2022-01-29T05:49:32+05:30 IST
ప్రజల అభిప్రాయం తీ సుకోకుండా, ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లే కుండా అగమేఘాల మీద జిల్లాల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉండదని, ప్రభుత్వం తీసుకున్న ని ర్ణయంతో అద్దంకి నియోజకవర్గానికి తీరని న ష్టం జరుగుతుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే జిల్లాల ప్రస్తావన
ఎమ్మెల్యే రవికుమార్ ధ్వజం
అద్దంకి, జనవరి 28: ప్రజల అభిప్రాయం తీ సుకోకుండా, ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లే కుండా అగమేఘాల మీద జిల్లాల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉండదని, ప్రభుత్వం తీసుకున్న ని ర్ణయంతో అద్దంకి నియోజకవర్గానికి తీరని న ష్టం జరుగుతుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గం 120 కి. మీ దూరంలో ఉన్న బాపట్ల జిల్లాలో కలపటం వ ల్ల ప్రజలకు ఇబ్బందులు ఉంటాయన్నారు. చీరా ల డివిజన్‌లో కలపటం వల్ల అటు జిల్లా, ఇటు డివిజన్ రెండూ దూరంగా ఉంటాయన్నారు. ప్ర భుత్వం తొలుత రెవెన్యూ డివిజన్‌ల విషయంలో స్పష్టత తీసుకొని సమీప ప్రాంతాలను రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేసి జిల్లాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి జిల్లాల ప్రకటన చే యాలని, అలా కాకుండా పేపర్‌ల మీద చెప్పుకోటానికే జిల్లాలు చేయటం వల్ల ప్రయోజనం ఏ మి ఉండదన్నారు. రాష్ట్రంలో సమస్యలు అనేకం ఉన్నా వాటి పరిష్కారం కోసం కృషి చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం కొత్త జి ల్లాలు, డివిజన్‌ల ప్రతిపాదన తీసుకువచ్చిందన్నారు. అద్దంకిని ఒంగోలు డివిజన్‌లోనే ఉంచి ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని ఎమ్మెల్యే రవికుమార్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.