వైౖసీపీ అక్రమాలపై చర్యలేవి : నారాయణరెడ్డి

ABN , First Publish Date - 2022-12-10T00:49:28+05:30 IST

పట్టణంలో వైసీపీ నాయకులు యథేచ్ఛగా భూ ఆక్రమణ లకు పాల్పడుతూ.. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారని మార్కాపురం మాజీ శాసనసభ్యలు కందుల నారాయణరెడ్డి ఆరోపించారు.

వైౖసీపీ అక్రమాలపై చర్యలేవి : నారాయణరెడ్డి

పొదిలి రూరల్‌ డిసెంబరు 9 : పట్టణంలో వైసీపీ నాయకులు యథేచ్ఛగా భూ ఆక్రమణ లకు పాల్పడుతూ.. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారని మార్కాపురం మాజీ శాసనసభ్యలు కందుల నారాయణరెడ్డి ఆరోపించారు. శుక్రవారం విశ్వబ్రాహ్మణ ఆరామక్షేత్రంలో నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చి వేయడంపై అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీసీ నాయకుల అక్రమాలపై ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని కేవలం బీసీ కులానికి చెందిన ఆరామక్షేత్రంపై గురువారం రాత్రి కోర్టు కాపీ అందగానే, శుక్రవారం ఉదయం ఏడు గంటలకు నిర్మా ణాలు కూల్చేందుకు ఆఘమేఘాల మీద చర్యలకు ఉపక్రమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలో భాగమేనని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేసే అఽఽధికారులు ఎప్పటికైనా శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడాలని మతపెద్దలు కోర్టును ఆశ్రయిస్తే వెంటనే ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చి నెలలైనా అక్రమార్కులపై చర్యలుతీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. చెరువులు, పంట కాలువలు ఆక్రమించి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న వారిపై ఏమి చర్యలు తీసుకున్నారని రోడ్డు మార్జిన్‌లను ఆక్రమించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు, ఇరిగేషన్‌ స్థలాలను ఆక్రమించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

చెత్తపాలనకు చరమగీతం పాడండి

మార్కాపురం(వన్‌టౌన్‌) : రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ చెత్త పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పిలుపు నిచ్చారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా స్థానిక 11వ వార్డులో కందుల నారాయణరెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చెత్త నుంచి నిత్యవసర వస్తువుల వరకు పన్నులు వేసి ప్రజలను పీడిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రానుందన్నారు. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్‌, తాళ్లపల్లి సత్యనారాయణ, డా.మౌలాలి, కందుల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:49:32+05:30 IST