అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు

ABN , First Publish Date - 2022-01-23T06:34:53+05:30 IST

సంక్షేమ పథకాలు మంజూరులో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్‌యాదవ్‌ హెచ్చరించారు.

అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు
సమీక్షిస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌

అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు

పీసీపల్లి, జనవరి 22 : సంక్షేమ పథకాలు మంజూరులో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్‌యాదవ్‌ హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.తమకు ఎప్పటినుంచో వస్తున్న పించన్లను వెల్‌ఫేర్‌ అసిస్టెంట్‌ తొలగించారని ప్రశ్నించిన తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని గుంటుపల్లి పంచాయతీకి చెందిన పలువురు సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ వెల్‌ఫేర్‌ అసిస్టెంట్‌ వీరప్రతాప్‌ను వివరణ కోరగా తాను తొలగించలేదని పైనుంచి వచ్చిన నోటీసులను లబ్దిదారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అనర్హులు పింఛన్లు కోల్పొయారన్నారు. అక్కడే ఉన్న గ్రామస్థులు, వైసీపీ నాయకులు పలువురు మాట్లాడుతూ.. పనులకోసం సచివాలయానికి వెళ్లిన తమను వెల్‌ఫేర్‌ అసిస్టెంట్‌ డబ్బులు డిమాండ్‌ చేయడంతోపాటు తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో బర్రా మఽధసూదన్‌ యాదవ్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లు, గ్రామస్థుల నుంచి ఫిర్యాదు తీసుకుని వెల్‌ఫేర్‌ అసిస్టెంట్‌పై కేసు నమోదు చేయాలని ఎస్సై ప్రేమ్‌కుమార్‌ను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహసీల్దార్‌ సింగారావును ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ అత్యాల జపన్య, జడ్పీటీసీ లక్ష్మీకాంతం,ఎంపీడీవో కె.కుసుమకుమారి, ఎంపీటీసీ చెరుకూరి సతీష్‌, కొండారెడ్డి, మాలకొండయ్య, ఓకె రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read more