పేదల పింఛన్లు తొలగించడం దుర్మార్గం
ABN , First Publish Date - 2022-12-31T00:34:59+05:30 IST
పేదలకు ఇచ్చే సామాజిక పింఛన్లు తొలగింపు విధానాల ను సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉపసంహరించుకోకపో తే తగిన మూల్యం చెల్లించక తప్పదని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు మునగా రమేష్ హెచ్చరిం చారు.
జనసేన నగర అధ్యక్షుడు రమేష్
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 30: పేదలకు ఇచ్చే సామాజిక పింఛన్లు తొలగింపు విధానాల ను సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉపసంహరించుకోకపో తే తగిన మూల్యం చెల్లించక తప్పదని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు మునగా రమేష్ హెచ్చరిం చారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థా నిక కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఒక వైపు కొత్త పింఛన్లు ఇస్తున్నా మంటూ ఆర్భాటపు ప్రచారం చేసుకుంటూ ఇంకొ క వైపు పాత పింఛన్లు తొలగించడం సిగ్గుచేట న్నారు. జిల్లాలో 8వేల మందికి పైగా పలు రకాల పింఛన్లు తొలగించేందుకు నోటీసులు ఇచ్చారని, ఇందులో ఒంగోలు నగరంలో రెండువేల మందికి పైగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికల సమ యంలో అనేక హామీలు గుప్పించిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పింఛన్లు రద్దు కోసం ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోక పోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కో తల ప్రభుత్వంగా మారిందన్నారు. ప్రజలను వం చనకు గురిచేస్తే రానున్న ఎన్నికల్లో తగిన గుణ పాఠం చెప్తారని మండిపడ్డారు. అనంతరం డీఆ ర్వో చిన్నఓబులేషుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చిట్టేం ప్రసాద్, చన పతి రాంబాబు, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, ము త్యాల రామకృష్ఱ, మణికుమార్, గోవిందు కోమలి, మనోజ్‌కుమార్, సుధాకర్, పోకల హనుమంతరా వు, శివన్నారాయణ, ఆకుపాటి ఉష, తన్నీరు ఉష, పి.పవన్, మాల్యాద్రినాయుడు, కోసూరి శిరీష, సుంకర కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.