90 కొవిడ్‌ పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2022-01-13T06:14:34+05:30 IST

ల్లాలో రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజుల నుంచి వెలువడుతున్న ఫలితాలు భవిష్యత్‌పై ఆందోళనను కలిగిస్తున్నాయి.

90 కొవిడ్‌ పాజిటివ్‌లు

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 12: జిల్లాలో రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజుల నుంచి వెలువడుతున్న ఫలితాలు భవిష్యత్‌పై ఆందోళనను కలిగిస్తున్నాయి. ఆదివారం 40 కేసులు నమోదు కాగా బుధవారం 33, మంగళవారం 46  వెలుగు చూసిన విషయం తెలిసిందే. సోమవారం 90 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో  మరోసారి కరోనా కలవరం మొదలైంది. వీటితో కలిపి ఇప్పటివరకు 1,39,089 మంది వైరస్‌ బారిన పడ్డారు. వారిలో 1,37,727 మంది కోలుకున్నారు. 1,130 మంది మృతిచెందారు. ప్రస్తుతం 232 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా బుధవారం 165 కేంద్రాల్లో  20,784 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు 52,55,860 డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. 

Updated Date - 2022-01-13T06:14:34+05:30 IST