విద్యార్థులు 9 మంది.. తరగతి గదులు 3

ABN , First Publish Date - 2022-11-11T23:14:59+05:30 IST

ఆ పాఠశాల లో విద్యార్థులు తొమ్మిది మంది ఉండగా, మూడు తరగతి గదులు ఉన్నాయి. ఇటు వంటి పాఠశాల మరమ్మతులకుగాను ప్ర భుత్వం తాజాగా నాడు - నేడు ద్వారా రూ.11 లక్షల నిధులను మంజూరు చేసింది.

విద్యార్థులు 9 మంది.. తరగతి గదులు 3

నాడు నేడు ద్వారా రూ.11 లక్షల నిధులు మంజురు

వృథా కానున్న ప్రభుత్వ నిధులు

బల్లికురవ, నవంబరు 11: ఆ పాఠశాల లో విద్యార్థులు తొమ్మిది మంది ఉండగా, మూడు తరగతి గదులు ఉన్నాయి. ఇటు వంటి పాఠశాల మరమ్మతులకుగాను ప్ర భుత్వం తాజాగా నాడు - నేడు ద్వారా రూ.11 లక్షల నిధులను మంజూరు చేసింది. విద్యార్థులే లేని పాఠశా లకు నిధులు మంజురు చేయటం పట్ల ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు సరై న పర్యవేక్షణ చేపట్టకుండా తప్పుడు నివేదికలు పంప టం వలనే ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఉన్న పాఠశాలలకు నాడు- నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపడితే వారికి ఉపయెగపడతాయని వారు అంటున్నారు.

బల్లికురవ మండలంలోని అంబడిపూడి ప్రాథమిక పాఠశాల(హెచ్‌ఈ)ని దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఏ ర్పాటుచేసింది. 2012లో అప్పటి ప్రభుత్వం ఇదే పాఠశాలను మరమ్మతులు చేపట్టి అదనపు తరగతిగా ఉన్న పాఠశాలపైన అంతస్థు వేశారు. అప్పటి నుంచి ఈ పాఠశాలలో సుమారు వంద మంది విద్యార్థుల వరకు విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవల ప్రబుత్వం 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయటంతో అప్పటికి ఉన్న 47 మందిలో 16 మంది ఉన్నత పాఠశాలకు అప్‌గ్రేడ్‌ అయ్యారు. మిగిలిన 31 మందిలో 24 మంది 3,4,5 తరగతుల విద్యార్థులు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లారు. ఇంకా ఏడుగురు విద్యార్థులు మాత్రమే మిగలగా, కొత్తగా మరో ఇద్దరు చేరారు. మెత్తం ఇప్పుడు 1,2 తరగ తులకు తొమ్మిది మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యా యుడు మాత్రమే పాఠశాలలో ఉన్నారు.

వంద మందికి సరిపడ ఉన్న మూడు తరగతి గదులలో ఇప్పుడు తొమ్మిది మందే ఉన్నారు. ఇంత సౌకర్యాలు ఉన్న పాఠశా లకు ప్రభుత్వం ఇప్పుడు నాడు - నేడు ద్వారా రూ.11 లక్షల నిధులను మంజురు చేసింది. గత వారం రోజుల నుంచి పను లు మెదలు పెట్టారు. విద్యార్థులే లేని పాఠ శాలకు నిధుల మంజూరుదేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఏడాది ఉన్న విద్యార్థులు కూడా పాఠశాలకు వచ్చే అవకాశం లేదని వారు అంటున్నారు. ప్రభుత్వం విలీనం చేయటం వలన ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని వి ద్యార్థుల తల్లిదం డ్రులు ఆరోపి స్తున్నారు. గ తంలో ప్రాథమిక విద్య సక్రమంగా అందేదని, ఇప్పుడు ఉన్నత పాఠశాలల్లో వారికి సరైన వసతులు అందటం లేదని వారు అంటు న్నారు. మండల విద్యాశాఖ తప్పుడు నివేదిక లు పంపి చేతులు దులుపుకొందని, దీంతో కొన్నిచోట్ల విద్యార్థులు ఉంటే తరగతి గదులు లేవని.. మరికొన్ని చోట్ల తరగతి గదులు ఉంటే విద్యా ర్థులు లేరని వారు అంటున్నారు. ప్రభుత్వ నిధులు వృథా కాకుండా పర్యవేక్షణ చేపట్టా ల్సిన అధికారులు పట్టీపట్టనట్టుగా వ్యవహరి స్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తు న్నారు.

ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే నాడు- నేడు పాఠశాలలను పరిశీలించి అవసరం అను కొన్న పాఠశాలలకే ప్రభుత్వ నిధులు వెచ్చించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-11-11T23:14:59+05:30 IST

Read more