323 మంది టీచర్లకు ఉద్యోగోన్నతి

ABN , First Publish Date - 2022-10-18T05:22:13+05:30 IST

జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి ప్రక్రియ ముగిసింది. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం కొత్త పోస్టులు మంజూరు చేసి ఈ ప్రక్రియను ఇటీవల చేపట్టారు.

323 మంది టీచర్లకు ఉద్యోగోన్నతి

అర్హులు లేక మిగిలిన 149 పోస్టులు

ఒంగోలు(విద్య), అక్టోబరు 17 : జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి ప్రక్రియ ముగిసింది. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం కొత్త పోస్టులు మంజూరు చేసి ఈ ప్రక్రియను ఇటీవల చేపట్టారు. మొత్తం 677 పోస్టులు అవసరం కాగా 70శాతం ఉద్యోగోన్నతుల ద్వారా అంటే 472 పోస్టులు భర్తీచేయాల్సి ఉంది. 205 పోస్టులు డీఎస్సీ ద్వారా చేయాలి. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో మొత్తం 472 హెచ్‌ఎం, స్కూలు అసిస్టెంట్‌ పోస్టులు ప్రమోషన్‌ ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 232మందికి మాత్రమే ఉద్యోగోన్నతులు లభించాయి. అర్హులైన వారు లేనికారణంగా 149 పోస్టులు మిగిలిపోయాయి. జడ్పీ యాజమాన్యంలోని పాఠశాలల్లో 321 మంది ఉద్యోగోన్నతి పొందగా, ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో కేవలం ఇద్దరికి మాత్రమే లభించింది. దీంతో జడ్పీ పాఠశాలల్లో 110 పోస్టులు ప్రభుత్వ పాఠశాలల్లో 39 పోస్టులు మిగిలిపోయాయి.

ూ జడ్పీ యాజమాన్యంలోని పాఠశాలల్లో గ్రేడ్‌-2 హెడ్మాస్టర్లు 49, స్కూలు అసిస్టెంట్‌ బయోలాజికల్‌ సైన్స్‌ 19, ఇంగ్లీషు 161, గణితం 78, ఉర్దూ 8 పోస్టులు నూరుశాతం భర్తీ అయ్యాయి. వ్యాయామ విద్యలో మాత్రం 116 పోస్టులకు గాను కేవలం ఆరు పోస్టులు మాత్రమే ఉద్యోగోన్నతులు కల్పించగలిగారు. జిల్లాలో పీఈటీలు అందరూ అప్‌గ్రేడేషన్‌ ద్వారా ఇప్పటికే పీడీలుగా ప్రమోషన్‌ పొందారు. దీంతో 110 పోస్టులు మిగిలాయి. 

ూ ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో ఎస్‌ఏ జీవశాస్త్రం నాలుగు పోస్టులకు గాను ఒకటి, సోషల్‌ స్టడీస్‌ ఐదు పోస్టులకు ఒక్కటి మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో గణితం తొమ్మిది, జీవశాస్త్రం మూడు, ఇంగ్లీషు 10, వ్యాయామవిద్య తొమ్మిది, సోషల్‌ స్టడీస్‌ నాలుగు, తెలుగు నాలుగు పోస్టులు మిగిలాయి. 




Updated Date - 2022-10-18T05:22:13+05:30 IST