14న సంగమేశ్వర ఆలయం వద్ద వనభోజనాలు
ABN , First Publish Date - 2022-11-10T23:57:53+05:30 IST
పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు సంగమేశ్వర ఆలయం వద్ద ఈనెల 14న టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్తీక వనభోజన కార్యక్రమంలో టీడీపీ నా యకులు, కార్యకర్తలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీ డీపీ మండల అధ్యక్షుడు బొడ్డపాటి యల్లమంద నాయుడు, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ నాయకుడు గొర్రెపాటి రామయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తుల నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు
ప్రజలు భారీగా తరలిరావాలని టీడీపీ పిలుపు
కొండపి, నవంబరు10: పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు సంగమేశ్వర ఆలయం వద్ద ఈనెల 14న టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్తీక వనభోజన కార్యక్రమంలో టీడీపీ నా యకులు, కార్యకర్తలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీ డీపీ మండల అధ్యక్షుడు బొడ్డపాటి యల్లమంద నాయుడు, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ నాయకుడు గొర్రెపాటి రామయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తుల నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయం త్రం వారు మండల నాయకులతో కలిసి కొండపిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమం భారీగా జరుగుతుందని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయంగా పాల్గొని వన భోజనాలు చేసి సంగమేశ్వరుడిని దర్శించుకునే ఈ కార్యక్రమానికి అన్నిగ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు చాగంరెడ్డి నరసారెడ్డి, తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, దామా మురళి, నన్నూరి సుబ్బారామయ్య, వీరాస్వామి, తెలుగు యువత అధ్యక్షుడు షేక్ ఖాఈషా పాల్గొన్నారు.