ట్రాఫిక్‌లో చిక్కుకున్న 108
ABN , First Publish Date - 2022-12-15T23:00:39+05:30 IST
కనిగిరి పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ స మస్య తీవ్రమవుతోంది. గురువా రం అత్యవసరంగా వెళ్తున్నా 108 అంబులెన్స్ వాహనం రద్దీలో చిక్కు కుంది. అయినా అధికారులకు చల నం లేదు. పాలకుల నిర్లక్ష్యానికి 108 హ నాలకు కూడా దారి ఇచ్చే పరిస్థి తి ఎదురవుతోందని ప్రజలు అంటున్నారు.
తీవ్రమవుతున్న వాహనాల రద్దీ
పట్టించుకోని అధికారులు
కనిగిరి, డిసెంబరు 15 : కనిగిరి పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ స మస్య తీవ్రమవుతోంది. గురువా రం అత్యవసరంగా వెళ్తున్నా 108 అంబులెన్స్ వాహనం రద్దీలో చిక్కు కుంది. అయినా అధికారులకు చల నం లేదు. పాలకుల నిర్లక్ష్యానికి 108 హ నాలకు కూడా దారి ఇచ్చే పరిస్థి తి ఎదురవుతోందని ప్రజలు అంటున్నారు. గురువారం మధ్యాహ్నం మండలంలోని చల్లగిరగల ప్రాంతంలో గర్భిణి పురిటి నొప్పులు రావడంతో 108కు సమా చారం అందింది. దీంతో ఆ గ్రామం నుంచి గర్భిణిని ప్రభుత్వాసుపత్రికి తీసుకు వచ్చేందుకు 108 వాహనం బయలుదేరింది. కానీ పామూరు బస్టాండు సెంటరుకు వచ్చేసరికి ట్రాఫిక్‌లో ఇరుక్కు పోయింది. ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహిస్తు న్న పోలీసు సిబ్బంది 108 వాహనాన్ని పంపిచేందుకు నానా తిప్పలు పడాల్సి వ చ్చింది. దీంతో వాహనదారులు పాలకుల నిర్లక్ష్య వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. పామూరు బస్టాండ్ సెంటరులో వాహనాల రద్దీతో పాటు రోడ్డు పైకి వచ్చి పండ్ల దుకాణాలు నిర్వహిస్తున్నా పట్టించుకునే వారే లేరు. పండ్ల దుకాణదారులు ఇచ్చే మామూళ్లు పుచ్చుకుని పోలీసు సిబ్బంది మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవు తున్నాయి. మున్సిపల్ చైర్మన్ గఫార్ అసమర్ధ పాలనకు ట్రాఫిక్ సమస్యలు నిదర్శ నంగా కన్పిస్తున్నాయి. ఫొటోలకు ఫోజులే తప్ప ఆచరణలో మాత్రం చర్యలు శూన్య మని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా అధికారులు, పాలకులు పామూరు బస్టాం డ్ వద్ద ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.