జిల్లా రగ్బీ జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2022-10-18T03:10:14+05:30 IST

పట్టణంలోని డీఎన్‌ఆర్‌ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా రగ్బీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా రగ్బీ జట్లను

జిల్లా రగ్బీ జట్ల ఎంపిక
ఎంపికైన రగ్బీ జట్లతో ఉపాధ్యాయులు

పొదలకూరు, అక్టోబరు 17: పట్టణంలోని డీఎన్‌ఆర్‌ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా రగ్బీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా రగ్బీ జట్లను ఎంపిక చేశారు. జిల్లా రగ్బీ సబ్‌ జూనియర్స్‌కు జట్లకు ఈ ఎంపిక జరిగింది. బాలుర విభాగంలో 40మంది, బాలికల విభాగంలో 35 మంది వివిధ మండలాల నుంచి  ఎంపికలకు హాజరయ్యారని అసోసియేషన్‌ సభ్యుడు పోతురాజు రమేష్‌ తెలిపారు. ఎంపికైన  జిల్లా జట్టు ఈనెల 22 నుంచి ప్రకాశం జిల్లాలో జరిగే 7వ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికయిన బాలికల జట్టులో రాపూరు బాలికల హైస్కూల్‌ నుంచి ఎన్‌.హరిణి, ఏ.వాణి, ఎస్‌.భానుప్రియ, ఎ.ప్రణవి, టి.సంతోషిణి, అలాగే చంద్రశేఖరపురం రెసిడెన్షియల్‌ పాఠశాల నుంచి ఎం.ఈశ్వరమ్మ, టి.కుసుమకుమారి. డి.జాహ్నవి, డి.మీనాక్షి, సీహెచ్‌.ఈస్మిత, ఎస్‌.రాజ్య సుస్మిత, ఎం.శివలాస్య (ఎంఎంఎల్‌ స్కూల్‌ కలిచేడు)లు  ఉన్నారు. బాలుర జట్టులో జడ్పీహెచ్‌ఎస్‌ గండవరం స్కూల్‌ నుంచి జి.కుమార్‌శంకర్‌, జి.దిలీప్‌, ఎస్‌కె.ఫిరోజ్‌, డి.జోయల్‌, ఎస్‌కె.షరీఫ్‌, సీహెచ్‌.మోక్షజ్ఞ, జడ్పీహెచ్‌ఎస్‌ కొత్తూరు నుంచి ఎం.శ్రీధర్‌, బి.హరికృష్ణ, ఎంఎల్‌ఎల్‌ కలిచేడు నుంచి వి.నితీష్‌, సూళ్లూరుపేట స్కూల్‌ నుంచి మోహిత్‌సాయి, ఎం.రూబేన్‌, చంద్రశేఖ రపురం నుంచి శ్రీనివాసులు ఉన్నారు. ఈ ఎంపికలకు ముఖ్యఅతిఽథులుగా బాలుర ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం అనీల్‌కుమార్‌, రగ్బీ అసోసియేషన్‌ సభ్యుడు నాగినేని శ్రీధర్‌, వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్‌రెడ్డి, విజయకుమారి, వంశీలు హాజరయ్యారు.


Updated Date - 2022-10-18T03:10:14+05:30 IST