జిల్లా సాధన సమితి నేతల హౌస్‌ అరెస్టు

ABN , First Publish Date - 2022-02-24T03:20:41+05:30 IST

ఉదయగిరి జిల్లా సాధన సమితి నాయకులను బుధవారం పోలీసులు ముందస్తుగా హౌస్‌ అరెస్టు చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రి

జిల్లా సాధన సమితి నేతల హౌస్‌ అరెస్టు
పోలీసుల అదుపులో జిల్లా సాధన సమితి నాయకులు

ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 23: ఉదయగిరి జిల్లా సాధన సమితి నాయకులను బుధవారం పోలీసులు ముందస్తుగా హౌస్‌ అరెస్టు చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతుండడం, ఉదయగిరిని జిల్లా కేంద్రంగా చేయాలని సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతున్న నేపథ్యంలో సాధన సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ వేణుగోపాల్‌, షేక్‌ దస్తగిరి అహ్మద్‌, ఉపాధ్యక్షుడు గాజులపల్లి రామిరెడ్డిలను వేణు నర్సింగ్‌ హోం నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపలా ఉంచారు. 


Read more