27న జెనకో థర్మల్‌ కేంద్రం మూడవ యూనిట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-18T04:58:51+05:30 IST

నేలటూరులోని జెనకో థర్మల్‌ కేంద్రం మూడవ యూనిట్‌ ఈ నెల 27వ తేదీన ప్రారంభం కానుంది.

27న జెనకో థర్మల్‌ కేంద్రం  మూడవ యూనిట్‌ ప్రారంభం
సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్‌తో చర్చిస్తున్న ఎండీ శ్రీధర్‌

సీఎం జగన రాక.. ఏర్పాట్ల పరీశీలన 

ముత్తుకూరు, అక్టోబరు 17 : నేలటూరులోని జెనకో థర్మల్‌ కేంద్రం మూడవ యూనిట్‌ ఈ నెల 27వ తేదీన ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను జెనకో ఎండీ శ్రీధర్‌ సోమవారం పర్యవేక్షించారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయరావు, ఏపీ జెనకో రాష్ట్ర డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రాజులతో కలిసి థర్మల్‌ పవర్‌ స్టేషన మూడో యూనిట్‌ పరిధిలో సిబ్బంది క్వార్టర్ల సమీపంలో హెలిపాడ్‌, బహిరంగ సభ వేదిక స్థలాలను, నిర్మాణంలో ఉన్న పైలానను పరిశీలించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ రాకపోకల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎండీ శ్రీధర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ నెల 27వ తేదీన జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందుకు తగినట్టుగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఏపీ జెనకో పరిపాలన భవనం సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన థర్మల్‌ పవర్‌ స్టేషన నమూనాను తిలకించారు. సెంట్రల్‌ కంట్రోల్‌ గది నుంచి మూడవ యూనిట్‌ను పరిశీలించారు. ఏపీ జెనకో సీఈ నాగరాజు, నెల్లూరు ఆర్డీవో మలోల, నుడా వైస్‌ చైర్మన బాపిరెడ్డి, ఏఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మాధవీ సుకన్య, డీఎస్పీ హరినాథరెడ్డి, తహసీల్దారు మనోహర్‌బాబు, ఇతర అధికారులు వారి వెంట ఉన్నారు.

Updated Date - 2022-10-18T04:58:51+05:30 IST