వీఎస్‌యూలో ఘనంగా యూత్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-13T00:09:06+05:30 IST

మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో సోమవారం వర్సిటీ రెండవ యువజనోత్సవాలు (ఇంటర్‌ కాలేజీ యూత్‌ ఫెస్టివల్‌) కృష్ణచైతన్య విద్యాసంస్థల సంయుక్త సహకారంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

  వీఎస్‌యూలో ఘనంగా యూత్‌ ఫెస్టివల్‌ ప్రారంభం
జెండా ఊపి యూత్‌ ఫెస్టివల్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న వీసీ సుందరవల్లి

వెంకటాచలం, డిసెంబరు 12 : మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో సోమవారం వర్సిటీ రెండవ యువజనోత్సవాలు (ఇంటర్‌ కాలేజీ యూత్‌ ఫెస్టివల్‌) కృష్ణచైతన్య విద్యాసంస్థల సంయుక్త సహకారంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వర్సిటీ వీసీ సుందరవల్లి జెండా ఊపి వర్సిటీ ప్రాంగణంలో యువజనోత్సవ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న నెల్లూరు రూరల్‌ డీఎస్పీ పీ.వీరాంజనేయరెడ్డి, వర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ పీ.రామచంద్రారెడ్డి, కృష్ణచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌వీ కృష్ణారెడ్డి, వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలనతో పోటీలను ప్రారంభించారు. అనంతరం వీసీ సుందరవల్లి మాట్లాడుతూ రెండు రోజులపాటు జరగనున్న యూత్‌ ఫెస్టివల్‌లో జిల్లా నలమూలల నుంచి వర్సిటీ పరిధిలో వివిధ కళాశాలల్లో డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు పాల్గొంటారని, డ్యాన్స్‌, మ్యూజిక్‌, క్విజ్‌, ఎలొక్యూషన్‌, డిబేట్‌, స్కిట్‌, మిమిక్రీ, మైమ్‌, రంగోళి, మెహందీ, పోస్టర్‌ మేకింగ్‌, తదితర అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నామన్నారు. విజేతలను పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర స్థాయి యూత్‌ ఫెస్టివల్‌కు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ జీ విజయానందకుమార్‌ బాబు, యూత్‌ ఫెస్టివల్‌ కోఆర్డినేటర్లు డాక్టర్‌ హనుమారెడ్డి, కృష్ణచైతన్య విద్యాసంస్థల డీన్‌ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:09:06+05:30 IST

Read more