మీకు ఆకలి విలువ తెలియదా!

ABN , First Publish Date - 2022-10-02T04:58:48+05:30 IST

అన్నా కాంటీన్లు కూలుస్తారా - మీకు ఆకలి విలువ తెలియదా అంటూ టీడీపీ నేతలు పిట్టి సత్యనారాయణ, కప్పిర శ్రీనివాసులు, రేవతిలు వైసీపీ నేతలను ప్రశ్నించారు.

మీకు ఆకలి విలువ తెలియదా!
అన్నా క్యాంటీన్‌లో రోగులకు అన్నదానం చేస్తున్న టీడీపీ

నెల్లూరు (వైద్యం) అక్టోబరు 1 : అన్నా కాంటీన్లు కూలుస్తారా - మీకు ఆకలి విలువ తెలియదా అంటూ టీడీపీ నేతలు పిట్టి సత్యనారాయణ, కప్పిర శ్రీనివాసులు, రేవతిలు వైసీపీ నేతలను ప్రశ్నించారు. శనివారం నగరంలోని బృందావనంలో అన్నా క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నా కాంటీన్లు కూల్చివేతకు నిరసనగా టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదేశాల ప్రకారం అన్నదానాలు నిర్వహి స్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఆసుపత్రులకు వచ్చిన రోగులకు, సహాయకులకు ఉచితంగా భోజనాలు అందచేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో అభాగ్యులను ఆదుకోవాలని అన్నా క్యాంటీన్లు తీసుకువస్తే జగన్‌ అధికారంలోకి రాగానే వాటిని మూసివేశారన్నారు. సొంత డబ్బుతో టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌లను సైతం కూల్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ఏడు కొండలు, పెంచల్‌బాబు, రమణయ్య, నాగరాజు, దశరధరామిరెడ్డి, ఉపేంద్ర, విజయ్‌, శివాని, కృష్ణ, గోపి 

Read more