ఆత్మకూరులో బహిరంగంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న YCP
ABN , First Publish Date - 2022-06-22T13:36:53+05:30 IST
ఆత్మకూరు నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంచే విషయంలో ఊరూరా పంచాయతీలు నడుస్తున్నాయి.

నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంచే విషయంలో ఊరూరా పంచాయతీలు నడుస్తున్నాయి. మర్రిపాడు మండలం రాజుపాలెం గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచే విషయంలో వైసీపీ (YCP) నేతల చర్చల వీడియో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. డబ్బులు పంచిన తర్వాత కూడా ఓట్లు ఫ్యాన్ గుర్తు పడతాయా? లేదా? అనే అయోమయంలో వైసీపీ నేతలు ఉన్నారు. ఈరోజు మందు, విందులకు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విధంగా వైసీపీ శ్రేణులు బహిరంగంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.