వైసీపీ నేతల దందాలను ఇక సాగనివ్వం

ABN , First Publish Date - 2022-09-30T03:43:34+05:30 IST

యోజకవర్గంలో వైసీపీ నేతల దందాలను ఇకముందు సాగనివ్వబోమని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు

వైసీపీ నేతల దందాలను ఇక సాగనివ్వం
విలేకరులతో మాట్లాడుతున్న ఇంటూరి, పొదిలి శ్రీనివాస్‌

కందుకూరు, సెప్టెంబరు 29: నియోజకవర్గంలో వైసీపీ నేతల దందాలను ఇకముందు సాగనివ్వబోమని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో  నియోజకవర్గ పరిశీలకుడు పొదిలి శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రావెల్‌ మొదలు, ఇసుక, మద్యం అక్రమ రవాణాతో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారని, వారికి అధికారులు సంపూర్ణంగా సహకరిస్తున్నారని విమర్శించారు. ఇకముందు వారి ఆటలు సాగనివ్వబోమని  హెచ్చరించారు.  కందుకూరు ఏఎంసీ కార్యదర్శి నిబంధనల మేరకు పనిచేయాలని చూస్తే వెంటనే బదిలీ ఉత్తర్వులు వచ్చాయంటే దాని అర్థం ఏమిటో అధికారపార్టీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు యన్‌వి సుబ్బారావు, యన్‌వి రమణయ్య, జి. మోషే, షేక్‌ రఫి, మాదాల చిన్నా, కె. శైలజ తదితరులు పాల్గొన్నారు.


Read more