మళ్లీ యథేచ్ఛగా అనధికార చేపల గుంటలు

ABN , First Publish Date - 2022-10-18T03:18:11+05:30 IST

మండలంలోని తరుణవాయిలో హైకోర్టు ఆదేశాలతో తొలగించిన చేపల గుంటలను మళ్లీ యథావిధిగా ఏర్పాటు చేశారు. తరుణ

మళ్లీ యథేచ్ఛగా అనధికార చేపల గుంటలు
గండి కొట్టిన ప్రాంతంలో మళ్లీ పూడ్చి వేసి సాగుదారులు

సంగం, అక్టోబరు 17: మండలంలోని తరుణవాయిలో హైకోర్టు ఆదేశాలతో తొలగించిన చేపల గుంటలను మళ్లీ యథావిధిగా ఏర్పాటు చేశారు. తరుణవాయిలో కొంత మంది రైతులు అనధికారికంగా చేపల గుంటలు ఏర్పాటు చేశారు. ఈ గుంటల వల్ల సమీప  పంట పొలాలు మునిగిపోతున్నాయి.  దీంతో రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సాగుదారులు చేపలు ఉన్నట్లు చెప్పి  స్టే తెచ్చారు. స్టే ముగిసిన తరువాత మళ్లీ పొలాల రైతులు కోర్టుకు వెళ్లి తొలగింపునకు అనుమతి తెచ్చుకున్నారు. దీంతో గత మేలో రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో గుంటలు తొలగించకుండా అక్కడడక్కడా చేపల గుంటలకు గండి కొట్టి నీటిని తొలగించారు. దీంతో సమస్య పరిష్కారమయిందని పొలాల రైతులు వదిలేశారు. అయితే  వారం కిందట చేపల గుంటల గండ్లను పూడ్చి  చేపపిల్లలు వదిలేందుకు నీరు పెట్టారు. దీంతో పంట పొలాల రైతులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో నాలుగు రోజుల కిందట దువ్వూరులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి సమస్యను పరిష్కరించాలని తహసీల్దారును ఆదేశించారు. నాలుగు రోజులైనా రెవెన్యూ అధికారి పట్టించుకోలేదని  బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనధికార చేపల గుంటలను తొలగించాలని వారు కోరుతున్నారు.


Updated Date - 2022-10-18T03:18:11+05:30 IST