అంతరాయం లేకుండా పగటిపూట విద్యుత్‌

ABN , First Publish Date - 2022-03-06T04:55:40+05:30 IST

వ్యవసాయానికి ఎలాంటి అంతరాయం లేకుండా పగటిపూట 9గంటల పాటు విద్యుత్‌ను అందిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఈఈ కృష్ణప్రసాద్‌ తెలిపారు.

అంతరాయం లేకుండా పగటిపూట విద్యుత్‌

విద్యుత్‌శాఖ ఈఈ కృష్ణప్రసాద్‌

నాయుడుపేట టౌన్‌, మార్చి 5 : వ్యవసాయానికి ఎలాంటి అంతరాయం లేకుండా పగటిపూట 9గంటల పాటు విద్యుత్‌ను అందిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఈఈ కృష్ణప్రసాద్‌ తెలిపారు. మండ లంలోని అన్నమేడు సబ్‌స్టేషన్‌లో శనివారం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే రైతులు తెలిపితే  వెంటనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం మర్లపల్లి రైతులు తమ గ్రామ సమీపాన పొలాల్లో జామాయిల్‌ తోటపైన వెళుతున్న విద్యుత్‌ లైన్లను మార్చాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ రూరల్‌ ఏఈ హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు.

Read more