యువత మానవతా విలువలు కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2022-09-18T03:47:19+05:30 IST

యువత మానవతా విలువలు కలిగి ఉండాలని అదానీ కృష్ణపట్నం పోర్టు ఎండీ, సీఈవో జీజే రావు తెలిపారు. శనివారం ఉదయం అ

యువత మానవతా విలువలు కలిగి ఉండాలి
బహుమతులు అందజేస్తున్న పోర్టు సీఈవో జీజే రావు

 పోర్టు సీఈవో

ముత్తుకూరు, సెప్టెంబరు 17 : యువత మానవతా విలువలు కలిగి ఉండాలని అదానీ కృష్ణపట్నం పోర్టు ఎండీ, సీఈవో జీజే రావు తెలిపారు. శనివారం ఉదయం అదానీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో ఫ్రీ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లా సెట్నల్‌ సహకారంతో అదానీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో 79 మంది యువకులకు ఆర్మీ ఎంపిక కోసం నెలపాటు ఉచితంగా శిక్షణ ఇచ్చామన్నారు. ఈ శిక్షణ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.  యువకులు  ఉన్నతస్థాయికి చేరినా తల్లిదండ్రులను, మాతృభూమిని మరువరాదన్నారు. శిక్షణలో ప్రతిభ చూపిన యువకులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించారు. ఆర్మీ ర్యాలీకి ఉపయోగపడే కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదానీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సౌత్‌జోన్‌ హెడ్‌ దానిష్‌ ఖురేషి, పోర్టు సెక్యూరిటీ హెడ్‌ వెంకటేష్‌, భాస్కరన్‌, తదితరులు పాల్గొన్నారు. 


Read more