విద్యుత్‌ తీగలు తగిలి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2022-10-01T03:27:39+05:30 IST

వెంకటాచలం రైల్వే స్టేషన్‌ వద్ద శుక్రవారం ఆగి ఉన్న గూడ్స్‌ రైలు పైకి ఎక్కిన యువకుడికి విద్యుత్‌ తీగలు తగిలి తీవ్ర గా

విద్యుత్‌ తీగలు తగిలి తీవ్రగాయాలు
గాయపడిన యువకుడు

వెంకటాచలం, సెప్టెంబరు 30: వెంకటాచలం రైల్వే స్టేషన్‌ వద్ద శుక్రవారం ఆగి ఉన్న గూడ్స్‌ రైలు పైకి ఎక్కిన యువకుడికి విద్యుత్‌ తీగలు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే సిబ్బంది కథనం మేరకు, వెంకటాచలం పంచాయతీ ఇందిరమ్మ కాలనీకి చెందిన రవి (22) రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న గూడ్స్‌ రైలు పైన కప్పి ఉన్న ప్లాస్టిక్‌ పట్టను పట్టుకుని లాగాడు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో రైల్వే విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు.  ఆ యువకుడి శరీరం బాగా కాలిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సమీపంలో ఉన్న సాగునీటి కాలువలోకి వెళ్లి దూకేశాడు. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం  ఇవ్వడంతో వారు వచ్చి  నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.


Read more