ఉపాధి పనుల్లో భారీగా నిధుల దుర్వినియోగం

ABN , First Publish Date - 2022-05-25T02:50:25+05:30 IST

మండలంలోని చిలకలమర్రిలో జరిగిన ఉపాధి పనుల్లో భారీగా నిధులు దుర్విని యోగమైనట్లు తెలుస్తోంది. మూడేళ్ల కాలంలో గ్రామం

ఉపాధి పనుల్లో భారీగా నిధుల దుర్వినియోగం
నిధుల దుర్వినియోగంపై డీఆర్‌పీని ప్రశ్నిస్తున్న మాజీ ఎంపీపీ సుబ్బరాజు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు పనికి వచ్చినట్లు మస్టర్లు

అనంతసాగరం, మే 24: మండలంలోని చిలకలమర్రిలో జరిగిన ఉపాధి పనుల్లో భారీగా నిధులు దుర్విని యోగమైనట్లు తెలుస్తోంది. మూడేళ్ల కాలంలో గ్రామంలో రూ.30 లక్షతో పనులు జరిగాయి. కరోనా కారణంగా రెండేళ్లు పనులపై సోషల్‌ ఆడిట్‌ జరగలేదు. దీంతో మూడేళ్ల కాలానికి సంబంధించిన పనుల తనిఖీ కార్యక్రమం వారం రోజులుగా సోషల్‌ ఆడిట్‌ డీఆర్‌పీ నాగరాజు నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక ఉన్నత పాఠశాల లో గ్రామసభను సర్పంచు కటారి నారాయణమ్మ ఆధ్వర్యం లో నిర్వహించారు. అయితే స్థానిక యువకులు కొందరు బెంగళూరు, హైదరాబాదు ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసుకొంటూ స్ధిరపడి వుండగా, గ్రామంలో జరిగిన ఉపాధి పనుల్లో వారు కూడా పనులు చేసినట్లు ఉపాధి సిబ్బంది మస్టర్లు వేశారు. అంతేకాక నిధులు డ్రా చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.  దీంతో ఈ విషయమై సర్పంచుతోపాటు మాజీ ఎంపీపీ ఎం సుబ్బరాజు, స్థానికులు అధికారులను నిలదీశారు. పనికి రాకుండా దూర ప్రాంతాల్లో ఉంటున్న వారిపేర్లతో నిధులు ఎలా దుర్వినియోగం చేస్తారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గత ఏడాది వరదలు వచ్చి చిలకల మర్రి వాగులో నీరు పుష్కలంగా వుంటే, ఆక్కడ పనులు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి రూ. 41,750 నిధులు డ్రా చేశారని, నీరున్న ప్రాంతంలో పనులు ఎలా  చేస్తారని వారు ప్రశ్నించారు. దీంతో గ్రామసభ నుంచి అధికారులు వెనుతిరిగారు. తమ గ్రామపరిధిలో సుమారు రూ.15 లక్షల వరకు నిధులు దుర్వినియోగమయ్యాయని, ఈవిషయమై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు.


Read more