తనిఖీకి విజిలెన్స్ అధికారుల రాక
ABN , First Publish Date - 2022-12-15T23:28:16+05:30 IST
విజిలెన్స్ అధికారులు గురువారం సాయంత్రం 4.45 నిమిషాలకు మండలంలోని కృష్ణారెడ్దిపాలెం సచివాలయానికి తనిఖీ నిమిత్తం వెళ్లారు.
కలిగిరి, డిసెంబరు15: విజిలెన్స్ అధికారులు గురువారం సాయంత్రం 4.45 నిమిషాలకు మండలంలోని కృష్ణారెడ్దిపాలెం సచివాలయానికి తనిఖీ నిమిత్తం వెళ్లారు. అప్పటికే సచివాలయానికి వేసి ఉన్న తాళాన్ని చూసి నివ్వెరపోయారు. సచివాలయంలో ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటలవరకు స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ సిబ్బంది విధుల్లో ఉండాలి. అందుకు భిన్నంగా కార్యాలయానికి తాళంవేసిన ఘటనపై కలెక్టర్ చక్రధర్‌బాబుకు సమాచారం అందించారు. దాంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఈవిషయమై ఎంపీడీవో కళాధరరరావును వివరణకోరగా విజిలెన్స్ అధికారుల ద్వారానే తనకు తెలిసిందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.