వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2022-06-29T03:40:19+05:30 IST
కందుకూరులోని 18వ వార్డుకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త షేక్ ఖాదర్బాషాకు వైద్య ఖర్చుల కోసం మంగళవారం నియో

కందుకూరు, జూన్ 28: కందుకూరులోని 18వ వార్డుకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త షేక్ ఖాదర్బాషాకు వైద్య ఖర్చుల కోసం మంగళవారం నియోజకవర్గ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు రూ. 50వేలు ఆర్థిక సహాయం అందించారు. లారీ డ్రైవర్ అయిన ఖాదర్బాషాకు 2014లో గుండెకు స్టంట్ వేయగా, అది విఫలమై ప్రస్తుతం బెలూన్ వేయాల్సి వచ్చింది. దీంతో ఆయనకు ఆర్థిక సహాయం చేయాలని పలువురు నాగేశ్వరరావు దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో ఇటీవల ఒంగోలు కిమ్స్‌లో ఖాదర్‌బాషాను పరామర్శించి రూ. 20వేలు అందించిన నాగేశ్వరరావు, మంగళవారం తన ప్రతినిధుల ద్వారా మరో రూ. 30వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దామా మల్లేశ్వరరావు, చిలకపాటి మధుబాబు, షేక్ సలాం, షేక్ మున్నా, మాబాషా, జహీర్, సలాం, జాకీర్, వడ్లమూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.