వైభవంగా దుర్గాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-10-04T03:48:22+05:30 IST

దుర్గాష్టమి వేడుకలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. అల్లూరులోని పోలేరమ్మ ఆలయం, కలుగోళమ్మ ఆలయం,

వైభవంగా దుర్గాష్టమి వేడుకలు
లింగసముద్రంలో అయ్యప్పస్వామి ఆలయంలో దుర్గామాతగా అమ్మవారు

అల్లూరు, అక్టోబరు 3: దుర్గాష్టమి వేడుకలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. అల్లూరులోని పోలేరమ్మ ఆలయం, కలుగోళమ్మ ఆలయం, మహాలక్ష్మమ్మ ఆలయం, గంగమ్మ, కన్యకాపరమేశ్వరి ఆలయం, దసరా  ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అన్ని ఆలయాల్లో అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. అలాగే మండలంలోని ఇస్కపల్లిలోని శ్రీఅన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో  దుర్గమ్మ అలంకారంలో అమ్మవారిని  కరెన్సీ నోట్లతో అలంకరించారు.  బీద గిరిధర్‌ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం తరపున ఈ అలంకారాన్ని నిర్వహించారు. 

లింగసముద్రం  : లింగసముద్రంలోని అయ్యప్పస్వామి ఆలయం, మొగిలిచెర్లలోని దత్తాత్రేయస్వామి ఆలయం, మండలంలోని పలు ఆలయాల్లో అమ్మవారు సోమవారం దుర్గామాతగా దర్శనమిచ్చారు. మండలంలోని చినపవనిలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా స్వామి వారిని చందన అలంకరణతో ప్రత్యేకంగా అలంకరించారు.

 

కందుకూరులో..


కందుకూరు :  పట్టణంలోని పెద్ద బజారులో ఉన్న కన్యకాపరమేశ్వరిని సోమవారం వివిధ రకాల పండ్లుతో ప్రత్యేకంగా అలంకరించారు.  కోవూరు రోడ్డులో ఉన్న దుర్గాభవాని ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

 అమ్మవారికి విరాళం

 

కందుకూరులోని కోవూరు రోడ్డులో ఉన్న దుర్గాభవాని సమేత కేదారేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌  రూ. 1,01,116లు విరాళాన్ని సోమవారం అందజేశారు. ఉదయం ఆలయాన్ని సందర్శించిన రాజేష్‌ను పూజారి మాధవస్వామి సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తూర్పుపాలెంలో ఉన్న బంగారమ్మతల్లి ఆలయంలోనూ రాజేష్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
Read more