-
-
Home » Andhra Pradesh » Nellore » venukabhadina prantalapi drusti-MRGS-AndhraPradesh
-
వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి : ఎమ్మెల్యే ఆనం
ABN , First Publish Date - 2022-09-11T04:17:26+05:30 IST
: వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శనివారం లింగసముద్రంలో

సైదాపురం,సెప్టెంబరు10: వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శనివారం లింగసముద్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. సచివాలయ ఆవరణంలో ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివమార్, తహసీల్దార్ కృష్ణ, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మెట్టకూరు ధనుంజయరెడ్డి, రాపూరు ఏఎంసీ చైర్మన్ నోటి రమణారెడ్డి, ఎంపీపీ పెంచలమ్మ, జడ్పీటీసీ పోలయ్య, పీఏసీఎస్ అధ్యక్షుడు కర్నం శ్రీనివాసులునాయుడు, సర్పంచులు వరప్రసాద్‌రాజు, సూర్తాని సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.