వాడీవేడిగా మర్రిపాడు మండల సమావేశం

ABN , First Publish Date - 2022-09-25T03:19:36+05:30 IST

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపీపీ గంగవరపు లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సమావేశం వాడీవేడిగా

వాడీవేడిగా మర్రిపాడు మండల సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

  మర్రిపాడు, సెప్టెంబరు 24 : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపీపీ గంగవరపు లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సమావేశం వాడీవేడిగా జరిగింది. ముందుగా సంక్షేమ పఽథకాలతోపాటు మండల అభివృద్ధిపై శాఖలవారీగా అధికారులతో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి  సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా విద్యుత్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ సమస్యలపై సర్పంచులు, ఎంపీటీసీలు అధికారుల తీరుపై ఎమ్మెల్యేకి వివరిస్తుండగా, సమావేశాన్ని సభ్యతగా నడిపించాలని ఎంపీడీవోకు విక్రమ్‌రెడ్డి తెలిపారు. ఏ ఒక్క సమస్య కూడా  పెండింగ్‌లో ఉండకూడదని సూచించారు. ఇంతలో జడ్పీటీసీ మల్లు సుధాకర్‌రెడ్డి కలుగజేసుకొని తాను కష్టపడి వివిధ రకాల గ్రాంట్ల నుంచి మార్చిలో సమారు రూ. 50లక్షలు మంజూరు చేయించా.. పనులు ఇంతవరకు ప్రారంభించలేదన్నారు. పనులు ప్రారంభించేలా చూడాలని ఎమ్మెల్యేని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ మండల అభివృద్ధికి తనవంతు సహకరిస్తానని తెలిపారు. అనంతరం మఽధ్యాహ్నం నుంచి రామనాయుడుపల్లిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగమణి, ఎంఆర్వో హేమంత్‌కుమార్‌, భీమవరం సొసైటీ  చైర్మన్‌ చిన్నారెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Read more