జిల్లా సాధనకు ఉద్యమిద్దాం

ABN , First Publish Date - 2022-03-06T03:23:24+05:30 IST

ఉదయగిరిని జిల్లాగా సాధించుకొనేందుకు పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ ఉద్యమించాలని టీడీపీ మండల కన్వీనర్‌, మైనారిటీ నాయకులు సీహెచ్‌ బయ్యన్న, షేక్‌ రియాజ్‌ పిలుపునిచ్చారు.

జిల్లా సాధనకు ఉద్యమిద్దాం
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న టీడీపీ నాయకులు

ఉదయగిరి రూరల్‌, మార్చి 5: ఉదయగిరిని జిల్లాగా సాధించుకొనేందుకు పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ ఉద్యమించాలని టీడీపీ మండల కన్వీనర్‌, మైనారిటీ నాయకులు సీహెచ్‌ బయ్యన్న, షేక్‌ రియాజ్‌ పిలుపునిచ్చారు. ఉదయగిరిని జిల్లా చేయాలని స్థానిక పంచాయతీ బస్టాండ్‌ సెంటర్‌లో నాల్గో రోజైన శనివారం కొనసాగిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి మండల టీడీపీ కమిటీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెనుకబడిన ఉదయగిరి లాంటి ప్రాంతాలను జిల్లాలు చేయడం ద్వారా అభివృద్ధిలో సమన్యాయం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రానికి సరైన రహదారి లేక ఉదయగిరి ప్రాంత వాసులు ఏళ్ల తరబడి నరకం అనుభవిస్తున్నారన్నారు. సాగు, తాగునీరు లేక జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారన్నారు. ఇవన్ని జరగాలంటే ఉదయగిరిని జిల్లా చేయడమే మార్గమని, దాని కోసం సమష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ వేణుగోపాల్‌, షేక్‌ దస్తగిరిఅహ్మద్‌, సభ్యులు షేక్‌ఎండీ ఖాజా, గాజులపల్లి రామిరెడ్డి, ఖాదర్‌బాషా, మన్సూర్‌, వెలుగొండ జలాల సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, టీడీపీ నాయకులు బొజ్జా నరసింహులు, నల్లిపోగు రాజా, ఓబులరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సందానీ, గయాజ్‌, సజిల్‌, జాను, ఖాన్‌సా తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-03-06T03:23:24+05:30 IST