ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో 8 నుంచి తరగతుల ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-28T22:49:33+05:30 IST

ఉదయగిరి మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో డిసెంబరు 8 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్నట్లు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్‌ డాక్టర్‌ ఏ.ప్రతా్‌పకుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో  8 నుంచి తరగతుల ప్రారంభం
విలేకరులతో మాట్లాడుతున్న ప్రతా్‌పకుమార్‌రెడ్డి

ఉదయగిరి రూరల్‌, నవంబరు 28: ఉదయగిరి మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో డిసెంబరు 8 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్నట్లు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్‌ డాక్టర్‌ ఏ.ప్రతా్‌పకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ప్రిన్సిపాల్‌ కరుణసాగర్‌తో కలిసి కళాశాలలోని తరగతి, పరీక్ష గదులు, గ్రంథాలయాలు తదితర మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్‌జీరంగా యూనివర్శిటీ పరిధిలో ఆరు ప్రభుత్వ, ఆరు అనుబంధ కళాశాలలు ఉన్నాయన్నారు. ఈ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ప్రవేశానికి ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. ప్రస్తుతం విద్యార్థుల అప్షన్‌ల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. కళాశాలలో చదివేందుకు ఆప్షన్‌ ఎంపిక చేసుకొన్న విద్యార్థులకు 7న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థుల ప్రవేశం చేపడతామన్నారు. తొలుత వ్యవసాయ విద్యపై విద్యార్థులు, తల్లిదండ్రులకు కళాశాలలో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఉదయగిరి కళాశాలలో 200 మంది విద్యార్థులు బీఎస్సీ(హానర్స్‌) కోర్సులో ప్రవేశం కల్పించడానికి చర్యలు చేపట్టామన్నారు.

ప్రిన్సిపాల్‌ బాధ్యతల స్వీకరణ

మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్‌గా సోమవారం కరుణసాగర్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ వ్యవసాయ కళాశాలలో సేద్య విభాగాఽధిపతిగా పని చేస్తూ పదోన్నతిపై ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ కార్యక్రమంలో మెరిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మనోజ్‌కుమార్‌రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T22:49:35+05:30 IST