-
-
Home » Andhra Pradesh » Nellore » tritilo tappina pramadam-MRGS-AndhraPradesh
-
త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
ABN , First Publish Date - 2022-02-20T03:01:00+05:30 IST
దొ దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఐరన్ పోల్స్ లోడుతో వెళుతున్న

లారీలో నుంచి కారుపై పడిన ఐరన్ పోల్
సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
దొరవారిసత్రం, ఫిబ్రవరి 19 : దొ దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఐరన్ పోల్స్ లోడుతో వెళుతున్న లారీలో నుంచి ఒక ఐరన్ పోల్ పక్కన వెళుతున్న కారుపై పడింది. అయితే పడిన ఐరన్ పోల్ కారుకు వెనుక వైపున తగలడంతో, కారు కొంతభాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయట పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రకాశం జిల్లావాసులు చెన్నైకి వెళుతున్నారు. ప్రమాదంలో నుంచి బయట పడిన వారు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొన్నారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.