నేతాజీకి నివాళి
ABN , First Publish Date - 2022-01-24T03:57:46+05:30 IST
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు పలువురు నివాళులర్పించారు.
సూళ్లూరుపేట, జనవరి 23 : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు పలువురు నివాళులర్పించారు. ఆయన 125వ జయంతిని ఆదివారం సూళ్లూరుపేటలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శ్రీహరికోట పునరావాస కేంద్రం కార్యదర్శి బైరి పార్థసారధి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి, ఇస్రో విశ్రాంత ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు జె. వెంకటేశ్వర్లు, జెట్టి వేణు, అలవల సురేష్ పాల్గొన్నారు.