ఫెరో అల్లాయిస్‌ ఫ్యాక్టరీతో తీవ్ర నష్టం

ABN , First Publish Date - 2022-09-12T05:08:45+05:30 IST

మున్సిపాల్టీలోని వెంకట్రావుపల్లి గ్రామ సమీపంలో ధరణి ఫెర్రో అల్లాయిస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె. శ్రావణ్‌ కుమార్‌, రైతు సంఘ మండల కార్యదర్శి లక్కు కృష్ణప్రసాద్‌, పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఫెరో అల్లాయిస్‌ ఫ్యాక్టరీతో తీవ్ర నష్టం
సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం కార్యదర్శి లక్కు కృష్ణప్రసాద్‌

ఆత్మకూరు, సెప్టెంబరు 11 : మున్సిపాల్టీలోని వెంకట్రావుపల్లి గ్రామ సమీపంలో ధరణి ఫెర్రో అల్లాయిస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె. శ్రావణ్‌ కుమార్‌, రైతు సంఘ మండల కార్యదర్శి లక్కు కృష్ణప్రసాద్‌, పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నేతాజీ క్లబ్‌లో ఆదివారం ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల జరిగే నష్టాలపై ఐక్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు వెంకట్రావుపల్లి, టి. ముస్తాపురం, కుప్పురుపాడు, జాలయ్యనగరం, ఆత్మకూరులోని పలువురు రైతులు, ఉద్యోగ, ఉపాధ్యా సంఘాల, జనవిజ్ఞాన వేదిక, పలు పార్టీల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే విష వాయువుల వల్ల ప్రజలు రోగాల బారిన పడతారని తెలిపారు. ఇలాంటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీకి గుట్టుచప్పుడు కాకుండా ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి  స్పందించి ఫ్యాక్టరీని జనావాసాలకు, పంటభూములకు, నేషనల్‌ హైవేకు దూరంగా ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు కుడుముల సుధాకర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్లు తుమ్మల చంద్రారెడ్డి, షేక్‌ సందానిబాషా, సీపీఎం నాయకులు గంటా లక్ష్మీపతి, కె. డేవిడ్‌రాజు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ శివకోటారెడ్డి, వేదిక నాయకులు సరేష్‌బాబు, రాఘవరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more