సచివాలయాలా...రేకుల షెడ్లా

ABN , First Publish Date - 2022-12-13T22:49:32+05:30 IST

ఇవి సచివాలయాలా..రేకుల షెడ్లా..ఇలా ఉంటే ఎలా ప్రజలకు సౌక్యర్యంగా ఉండదంటూ కలెక్టర్‌ కేవిఎన్‌ చక్రధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు.

 సచివాలయాలా...రేకుల షెడ్లా
కాగితాలపూరు సచివాలయం సిబ్బందిని ప్రశ్నిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

మనుబోలు, డిసెంబరు 13 : ఇవి సచివాలయాలా..రేకుల షెడ్లా..ఇలా ఉంటే ఎలా ప్రజలకు సౌక్యర్యంగా ఉండదంటూ కలెక్టర్‌ కేవిఎన్‌ చక్రధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. మండలంలోని గురివిందపూడి, కాగితాలపూరు సచివాలయాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు గ్రామాల్లోనూ సచివాలయాలు నిర్మాణాలు చేపట్టలేదు. రెండూ రేకులగదుల్లోనే ఉండడంతో ఆయన మండిపడ్డారు. ఎందుకు సచివాలయాలు పూర్తి కా లేదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్చి ఆఖరుకు సచివాలయాలు పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ పథకాలు, పరిపాలనపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఓటునమోదుపై బీఎల్‌వోలను ప్రశ్నించగా వారి నుంచి సమాధానం సక్రమంగా రాకపోవడంతో వారికి తగిన శిక్షణలు ఎందుకివ్వలేదని తహసీల్దార్‌ సుధీర్‌ను ప్రశ్ని ంచారు. ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు మరో తుపాను హెచ్చరికలు ఉన్నాయని, గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే వారిని అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ విధ్యాధరి, జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్‌ రాజు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ. అశోక్‌కుమార్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T22:49:32+05:30 IST

Read more