దివంగత సీఎం సంజీవయ్య జయంతిని మరచిన ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-03-06T05:07:42+05:30 IST
ఏపీ దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ విచారం వ్యక్తం చేశారు.
కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
నాయుడుపేట, మార్చి 5 : ఏపీ దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ విచారం వ్యక్తం చేశారు. దామోదరం సంజీవయ్య శత జయంతి సందర్భంగా శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చింతామోహన్ ఆయన చిత్రపటానికి పూలమాలవు వేసి నివాళుల ర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంజీవయ్య ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు నిర్వహించారన్నారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు రెండేళ్లుగా స్కాలర్‌షిప్పులు అందలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినెలలోనే దుగరాజపట్నం ఓడరేవు పనులను ప్రారంభించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. నెలరోజుల్లో పెట్రోల్, డీజిల్ రూ. 120, అదే బాటలో వంటగ్యాస్ ధర కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తీగల భాస్కర్, ఓజిలి మండల నాయ కులు వెంకట య్య, దొరవారిసత్రం మండల నాయకులు వెంకటయ్య, పెంచలయ్య, చిరంజీవి పాల్గొన్నారు.