బోధనా నాణ్యత అభివృద్ధికి టీచ్ టూల్ సాధనం
ABN , First Publish Date - 2022-08-14T03:03:59+05:30 IST
ఉపాధ్యాయులు బోధనా నాణ్యతను అభివృద్ధి చేసుకునేందుకు టీచ్ టూల్ సాధనమని డీఈవో రమేష్ పేర్కొన్నారు. కావలి రూ

కావలి, ఆగస్టు13: ఉపాధ్యాయులు బోధనా నాణ్యతను అభివృద్ధి చేసుకునేందుకు టీచ్ టూల్ సాధనమని డీఈవో రమేష్ పేర్కొన్నారు. కావలి రూరల్ మండలం రుద్రకోట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టీచ్ టూల్‌పై 9 రోజులు పాటు జరిగిన శిక్షణ శనివారం ముగిసింది. శిక్షణ పొందిన 45 మందికి సర్టిఫికెట్లను అందచేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ టీచ్ టూల్‌ను టీచర్లు చక్కగా వినియోగించుకుని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. శిక్షణలో మాస్టర్ ట్రైనర్లగా ఎస్. ప్రసూనాంబ, పెంచల ప్రసాద్, హరికృష్ణ వ్యవహరించారు. కోర్సు డైరెక్టర్లుగా ప్రధానోపాధ్యాయులు ఆర్. కనకారావు, పీ. వెంకటరమణ వ్యవహరించారు.