అధికారంలోకి రాబోయేది టీడీపీయే

ABN , First Publish Date - 2022-12-16T23:08:04+05:30 IST

ఈ సారి ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది టీడీపీయేనని ఆ పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు.

అధికారంలోకి రాబోయేది టీడీపీయే
స్థానిక మహిళ నుంచి సమస్యలను గురించి అడిగి తెలుసుకుంటున్న దినేష్‌రెడ్డి, పోలంరెడ్డి, టీడీపీ నాయకులు

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు16: ఈ సారి ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది టీడీపీయేనని ఆ పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఇస్కపాళెం పంచాయతీ పల్లాప్రోలు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో దినేష్‌రెడ్డితోపాటు ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. వారు ముందుగా గ్రామంలో పర్యటించి స్థానికుల నుంచి ‘ఈ ప్రభుత్వంలో మిమ్మల్ని బాధించే అంశాలు ఏవి’’ అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి మాట్లాడుతూ బాబు వస్తేనే జాబ్‌లు వస్తాయనే నినాదం యువత నోట తిరిగి మళ్లీ వింటున్నామన్నారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అవినీతి అక్రమాలుచేస్తే బహిర్గతం చేసి ప్రజలకు తెలిపేందుకు మీడియా సిద్ధంగా ఉందనీ, మీరు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి సూచించడం హాస్యాస్పదంగా ఉుందన్నారు. కోవూరు నియోజకవర్గంలో గంజాయి వ్యాపారాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంవీ. శేషయ్య, బత్తల హరికృష్ణ, నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి, వింజం రామానాయుడు, కావలి వెంకటేశ్వర్లు, హరనాథ్‌, శ్రీనివాసులు, కొండయ్య, వి.ప్రసాద్‌, తిరుపాలు, చైతన్య, జాకీర్‌, సుల్తాన్‌, షబ్బీర్‌, హరీష్‌, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:08:06+05:30 IST