చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి యువకులు

ABN , First Publish Date - 2022-12-31T23:33:06+05:30 IST

మండలంలోని మన్నేటికోటకి చెందిన 20 మంది వైసీపీ యువ కార్యకర్తలు శనివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. కొండపి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందు

చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి యువకులు
పార్టీ కండువా కప్పుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు

ఉలవపాడు, డిసెంబరు 31: మండలంలోని మన్నేటికోటకి చెందిన 20 మంది వైసీపీ యువ కార్యకర్తలు శనివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. కొండపి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు బాబు వెళుతుండగా మార్గమధ్యలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కోఆర్డినేటర్‌ అమ్మనబ్రోలు శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు మరో 20 మంది టీడీపీలో చేరారు.

క్యాలెండర్‌ ఆవిష్కరణ

వలేటివారిపాలెం, డిసెంబరు 31: మండలంలోని బడేవారిపాలెంకి చెందిన తాటికొండ రమేష్‌, ఇంటూరి ప్రసాద్‌లు రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఉలవపాడు మండలం మన్నేటికోటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరావు, నాయకులు జనిగర్ల నాగరాజు, షేక్‌ సలాం, షేక్‌ శతాక్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:33:06+05:30 IST

Read more