-
-
Home » Andhra Pradesh » Nellore » tdp leadrs gadapa gadapa ku badudu-MRGS-AndhraPradesh
-
అన్నివర్గాలపై బాదుడే బాదుడు : మాలేపాటి
ABN , First Publish Date - 2022-08-16T04:31:26+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్ చార్జీలతో పాటు అన్నిరకాల నిత్యావసరాల ధరలు పెంచి అన్ని వర్గాల ప్రజలను బాదుతోందని కావలి టీడీపీ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు.

కావలి, ఆగస్టు 15: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్ చార్జీలతో పాటు అన్నిరకాల నిత్యావసరాల ధరలు పెంచి అన్ని వర్గాల ప్రజలను బాదుతోందని కావలి టీడీపీ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని సుచేతనగర్ గిరిజన కాలనీలో సోమవారం టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించి ధరల పెరుగుదలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంచాల ప్రసాద్, మక్కెన హరిబాబు, తుళ్లూరు శ్రీనివాసులు, మనోహర్, కూరపాటి మాల్యాద్రి, వెంగయ్య, కాకుమాని మాల్యాద్రి, మల్లిఖార్జున, గంటా విజయ్, గంటా నరసింహం, పుల్లపనాయుడు, లింగంగుంట మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.