చంద్రబాబు రోడ్‌ షోకి తరలిన శ్రేణులు

ABN , First Publish Date - 2022-12-30T23:50:51+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి భాగంగా శుక్రవారం కోవూరులో నిర్వహిస్తున్న రోడ్డు షోకి పొదలకూరు టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది తరలి వెళ్లారు.

చంద్రబాబు రోడ్‌ షోకి తరలిన శ్రేణులు
బుచ్చి : దామరమడుగు నుంచి ర్యాలీగా చంద్రబాబు రోడ్‌షోకు బయలుదేరిన టీడీపీ నాయకులు

పొదలకూరు, డిసెంబరు 30 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి భాగంగా శుక్రవారం కోవూరులో నిర్వహిస్తున్న రోడ్డు షోకి పొదలకూరు టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది తరలి వెళ్లారు. గ్రామాల నుంచి కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో, బైకుల్లో స్వచ్ఛందంగా బయలుదేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు, పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున్‌నాయుడు, కోడూరు, భాస్కర్‌రెడ్డి, అక్కెం సుధా కర్‌రెడ్డి, బోగోలు భాస్కర్‌రెడ్డి, పులిపాటి వెంకటరత్నంనాయుడు, మద్దిరిళ్ల నరసింహులు యాదవ్‌, కొంగి వెంకటరమణయ్య, వెన్నపూస రాజశేఖ ర్‌రెడ్డి, జమీర్‌, కలగట్ల సందీప్‌, ప్రభాకర్‌, ఖాదర్‌బాషా, చినమస్తాన్‌, సుబ్బానాయుడు, శ్రీనివాసులురెడ్డి, నారప నాయుడు, హరి నారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు.

ఇందుకూరుపేట : మండలం నుంచి కోవూరులో జరిగే చంద్రబాబు నాయుడు రోడ్‌షోకు మండలం నుంచి దాదాపు 4వేల మంది కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తరలివెళ్లారు. ఈ ర్యాలీని మండల అబ్జర్వర్‌ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రావెళ్ల వీరేంద్రచౌదరి, ప్రధాన కార్యదర్శి మునగాల రంగారావు, కుమార్‌, రామచంద్రయ్య, పాల్గొన్నారు.

విడవలూరు : విడవలూరు మండలం నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయ కులు పెద్ద సంఖ్యలో కోవూరు తరలి వెళ్లారు. టీడీపీ జిల్లా అధికార పార్టీ ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, మండలపార్టీ అధ్యక్షుడు చెముకుల శ్రీనివా సులు, సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి సత్యవోలు సత్యంరెడ్డి, నాయకులు చిమటా వెంకటేశ్వర్లు, కుడుముల మల్లికార్జున, ఇమాంబాషా, రామిశెట్టి వెంకటేశ్వర్లు, దూది విజయరాఘవన్‌, రాజన్న, మాధవ్‌ ఆధ్వర్యంలో సుమారు 4 వేల మంది కార్యకర్తలు ఆటోలు, మోటారు బైక్‌లో వెళ్లారు.

రాపూరు : కోవూరులో జరిగిన చంద్రబాబు సభకు రాపూరు నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. ఎస్‌సీ సెల్‌ పార్టీ రాష్ట్రనేత రత్నం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. టీడీపీ తిరుపతి అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్లురెడ్డి ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. చంద్రబాబు సభలో తిరుపతి పార్లమెంటు టీ డీపీ అధికార ప్రతినిధి కొండ్లపూడి రాఘవరెడ్డి హడావుడి కనిపించింది. పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్‌ ముక్తియార్‌ చంద్రబాబును కార్‌వ్యాన్‌లో కలిశారు.

బుచ్చిరెడ్డిపాళెం : కోవూరులో చంద్రబాబు రోడ్‌షోకు బుచ్చిరెడ్డిపాళెం పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ఆపార్టీ మండల అధ్యక్షుడు ఎంవీ.శేషయ్య, బత్తల హరికృష్ణ, వింజం రామానాయుడు, దుగ్గిశెట్టి హరనాధ్‌, బండ్ల కొండయ్య, మహేష్‌నాయుడు ఆధ్వర్యంలో తరలివెళ్ళారు. ముందుగా దామరమడుగు వద్దకు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా కోవూరులో బజారు సెంటర్‌కు చేరుకున్నారు. మరి కొంతమంది నాయకులు పార్టీఆఫీసు నుంచ ఎవరికి వారుగా పలు వాహనాల్లో వెళ్లారు

Updated Date - 2022-12-30T23:50:51+05:30 IST

Read more