సాఫ్ట్‌వేర్‌ పేరుతో సంక్షేమ పథకాలకు మంగళం

ABN , First Publish Date - 2022-09-29T04:13:33+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో సాఫ్ట్‌వేర్‌ పేరుతో సంక్షేమ పథకాలకు మంగళం పాడుతున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్‌ పేరుతో సంక్షేమ పథకాలకు మంగళం
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

కావలి, సెప్టెంబరు 28: వైసీపీ ప్రభుత్వంలో సాఫ్ట్‌వేర్‌ పేరుతో సంక్షేమ పథకాలకు మంగళం పాడుతున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కావలి టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్‌బాబు, జ్యోతి బాబూరావు, ఉప్పుటూరు బాలగురుస్వామి, బొట్లగుంట శ్రీహరినాయుడు, షేక్‌ రఫీ, చవల రామకృష్ణ, అక్కిలగుంట సూర్యప్రకాష్‌, ఏటూరి శివ, హపీజ్‌ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మీ పేర్లను సాఫ్ట్‌వేర్‌ తీసుకోవటంలేదని అధికారులు మోసం చేస్తున్నారన్నారు. కొత్తవి ఇవ్వక పోగా ఉన్నవాటిని కూడా రకరకాల కారణాలతో తొలగిస్తున్నారన్నారు. అయితే వైసీపీ అడుగులకు మడుగులు ఎత్తే వారికి మాత్రం అనర్హులైనా పథకాలను అందిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించలేనప్పుడు సీఎం జగన్‌ బటన్‌లు నొక్కి ప్రయోజనం ఏమిటని పేర్కొన్నారు. హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్సార్‌ పేరు తగిలించటం నీచమైన చర్య అన్నారు.

Read more