నారీ సంకల్ప దీక్షను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-03-06T03:26:54+05:30 IST

మహిళల సమస్యలపై పోరాడేందుకు నెల్లూరు అనిల్‌ గార్డెన్‌లో ఆదివారం చేపట్టిన నారీ సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి పిలుపునిచ్చారు.

నారీ సంకల్ప దీక్షను విజయవంతం చేయండి
మాలేపాటితో చర్చిస్తున్న తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

కావలి, మార్చి 5: మహిళల సమస్యలపై పోరాడేందుకు నెల్లూరు అనిల్‌ గార్డెన్‌లో ఆదివారం చేపట్టిన నారీ సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి పిలుపునిచ్చారు. శనివారం ఆమె కావలిలోని టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు నివాసంలో ఆయనతో చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నాయని దిశ చట్టానికి దశ లేకుండా పోయిందన్నారు. నారీ సంకల్ప దీక్షకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2022-03-06T03:26:54+05:30 IST