ఎన్టీఆర్‌ కీర్తిని ఎవరూ తగ్గించలేరు

ABN , First Publish Date - 2022-09-28T04:39:30+05:30 IST

యూనివర్శిటీకి పేరు మార్చడం ద్వారా యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారవు కీర్తిని తగ్గించడం ఎవరి తరమూ కాదని తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ కీర్తిని ఎవరూ తగ్గించలేరు
టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతున్న కాకర్ల

కాకర్ల తిరుమలనాయుడు

కలిగిరి, సెప్టెంబరు 27: యూనివర్శిటీకి పేరు మార్చడం ద్వారా యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారవు కీర్తిని తగ్గించడం ఎవరి తరమూ కాదని తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు పేర్కొన్నారు. మండలంలోని పెద్దపాడు గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కలిగిరిలో టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ విధ్వంసాలు తప్ప నిర్మాణాలు ఎరుగని ఏకైక ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అన్నారు. ప్రజలను దారి మళ్లించడానికి విషపూరిత కుట్రలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్న వైసీపీకి ప్రజలు చరమగీతం పాడే రోజు ఆసన్నమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ బలపరచిన కంచర్ల శ్రీంత్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్‌ గౌడ్‌, మార్కండేయ, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు గంగవరపు మధన్‌కుమార్‌, దత్తాత్రేయ, రామకృష్ణ, విష్ణు, ప్రసాద్‌, పెద్దన్న, నిశ్శంకర సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more