టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం

ABN , First Publish Date - 2022-09-29T05:19:45+05:30 IST

తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు.

టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల

 మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ


కలువాయి, సెప్టెంబరు 28 : తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. కలువాయిలో రెండో రోజు బుధవారం జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన మాజీమంత్రి పరసారత్నంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కురుగొండ్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ పాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. ఎప్పడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో వైపీపీ నాయకులు తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్ని అక్రమాలకైనా దిగుతారని వాటిని టీడీపీ నాయకులు,   కార్యకర్తలు ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ ఇకపై టీడీపీ కార్యకర్తలంతా సైనికులుగా పనిచేసి పార్టీని అధికారం వైపు నడిపించాలని కోరారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు.  కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు శ్రీనాథ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జీ.వెంకటేశ్వర్లు నాయుడు, మండల ఇన్‌చార్జ్‌ జెన్ని రమణయ్య, తిరుపతి పార్లమెంటు ఎస్సీసెల్‌ అధ్యక్షుడు శ్రీపతిబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Read more