చోరీలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2022-11-30T23:19:50+05:30 IST

డివిజన్‌లో చోరీలు, రహదారుల ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి తెలిపారు.

చోరీలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
సంగం పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతున్న డీఎస్పీ కోటారెడ్డి

సంగం, నవంబరు 30: డివిజన్‌లో చోరీలు, రహదారుల ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి తెలిపారు. ఆత్మకూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలిసారి బుధవారం సంగం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి తెలుసుకుని ఎస్‌ఐకి పలుసూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే కొత్తగా ఏర్పడిన సంగం సర్కిల్‌ పరిధిలోని చేజర్ల, సంగం, ఏయస్‌పేటలో పోలీస్‌ కేసులు, ఇతర అంశాలపై సీఐ రవినాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు ముందస్తు చర్యల్లో భాగంగా మండల కూడళ్లు, వ్యాపార దుకాణాలు, ఆలయాలు తదితర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలు, చోరీలు, రహదారుల ప్రమాదాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట సీఐ రవినాయక్‌, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, పోలీసు సిబ్బంది

Updated Date - 2022-11-30T23:20:57+05:30 IST

Read more