రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్ లేక ఇక్కట్లు
ABN , First Publish Date - 2022-05-21T04:55:21+05:30 IST
రెండేళ్లుగా రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్ లేక పొదలకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇబ్బందులు తప్పడం లేదు. కలువాయి,
పొదలకూరు రూరల్, మే 20 : రెండేళ్లుగా రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్ లేక పొదలకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇబ్బందులు తప్పడం లేదు. కలువాయి, చేజర్ల మండలాల రిజిస్ట్రేష న్లు కూడా పొదలకూరు కార్యాలయంలోనే జరుగుతాయి. ప్లాట్లు, పొలాలు రిజిస్ట్రేషన్ చేయిం చుకునే వారు వస్తుంటారు. సుదీర్ఘకాలంగా ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతున్నందున అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్లు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్లు గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా వారికి నియమ నిబంధనలు సక్రమంగా తెలియక రిజిస్ట్రేషన్లు చేయలేకపోతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. దాని ఫలితంగా ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్నట్లు తెలుస్తుంది. ఇచ్చిన లక్ష్యాలు అందుకోలేకపోతున్నారు. అయితే బయట వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లు కొందరు పెత్తనం చెలాయిస్తూ రిజిస్ట్రేషన్లకు కొర్రీలు పెట్టి అదనంగా నగదు గుంజుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్‌ను నియమించాలని కోరుతున్నారు.